WWW.Moviemanthra Rating 3/5 తమిళ హీరో ఆర్య కు తెలుగులో కూడా మంచి పేరే ఉంది. ‘వరుడు’ సినిమాలో విలన్ గా ‘సైజ్ జీరో’ సినిమాలో హీరోగా అలాగే డబ్బింగ్ సినిమాలతో ఎప్పటికప్పుడు... కడుపు చెక్కలయ్యేలా నవ్వించే ఎంటర్టైనర్ ‘ఐశ్వర్యాభిమస్తు’.

WWW.Moviemanthra Rating 3/5
తమిళ హీరో ఆర్య కు తెలుగులో కూడా మంచి పేరే ఉంది. ‘వరుడు’ సినిమాలో విలన్ గా ‘సైజ్ జీరో’ సినిమాలో హీరోగా అలాగే డబ్బింగ్ సినిమాలతో ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటాడు ఆర్య. అతని ‘నేనే అంబానీ’ ‘రాజా రాణి’ సినిమాలు మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి. అందుకే దాదాపు ఇతని అన్ని సినిమాలు తెలుగులో అనువాదం అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆర్య మిల్కీ బ్యూటీ తమన్నా తో జతకట్టి ‘వాసువుమ్ శరవణనుమ్ ఒన్నా పడిచవంగా’ అనే సినిమాలో నటించాడు. అదే సినిమా ఇప్పుడు తెలుగులో ‘ఐశ్వర్యాభిమస్తు’ గా మన ముందుకు వచ్చింది. కమెడియన్ సంతానం ఇందులో మళ్ళీ ఆర్య స్నేహితు డి పాత్ర పోషించగా, విశాల్ గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులని ఎంత మాత్రం నవ్వించిందో చూద్దామా..
కథ:
అభిమన్యు(ఆర్య), వాసు(సంతానం) చిన్నప్పటి నుండి కలిసే పెరుగుతారు. వయసుతో పాటే స్నేహం కూడా బలపడి ప్రాణ స్నేహితులుగా ఉంటారు. వాసుకి సీమా(భాను)తో వివాహం అవుతుంది. కానీ వివాహం అయిన మొదటి రోజే, అభిమన్యు సీమా కు కొన్ని ట్విస్టులు ఇవ్వడంతో ఆమె వాసు ని మొదటి రాత్రికి దూరం చేస్తుంది. అభిమన్యుతో స్నేహం వదులుకుంటే తప్ప నీతో సంసారం చేసే ప్రసక్తే లేదు అని కండిషన్ పెడుతుంది. ఇక చేసేది లేక ఎలాగైనా అభిమన్యుకి పెళ్లి చేసి, అతని తో స్నేహాన్ని ఆపేద్దాం అని ప్లాన్ వేస్తాడు వాసు. అందులో భాగంగా ఐశ్వర్య(తమన్నా) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే అభిమన్యు ఆమె ప్రేమలో పడిపోతాడు. ఇక అష్టకష్టాలు పడి తమన్నా ని ప్రేమలోకి దింపుతాడు అభిమన్యు. అన్నీ కుదిరి ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కే సమయంలో వాసు కొన్ని ప్రశ్నలు వేసి ఐశ్వర్యను విసిగిస్తాడు. కోపం తెచ్చుకున్న ఐశ్వర్య అభిమన్యు ను వాసు కి దూరంగా ఉండాలని, లేదంటే పెళ్లి చేసుకోనని ఖరాఖండిగా చెప్పేస్తుంది. అభిమన్యు, వాసు వాళ్ళ స్నేహ బంధాన్ని వదులుకున్నారా? లేక ఎలా వారి భార్యలను ఒప్పించారు అనేది మనం తెరపైన చూడాల్సిందే.
నటీనటులు
ఆర్య ఎప్పటిలాగానే ఈ సినిమాలో చాలా అందంగా కనిపించాడు. ఇక తన మునుపటి సినిమాల లాగానే ఈ సినిమా ద్వారా కూడా కామెడీ బాగానే పండించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేయడమే కాక, సినిమాలో ఎక్కడా నిరాశ పరచకుండా నవ్విస్తూనే ఉన్నాడు. ఇక సంతానం మళ్ళీ తన మార్క్ కామెడీ తో ప్రేక్షకుల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. తన పాత్ర ఉన్నంతసేపు సినిమా చాలా సరదా సరదాగా గడిచిపోతుంది. పంచ్ లతో బాగా అలరించేశాడు. మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్ ఒలకబోస్తూనే తన పాత్రను మరింత బాగా పండించింది. తను కూడా కొన్ని సీన్లలో బాగానే కామెడీ పంచిపెట్టింది. ఇక విద్యుల్లత కామెడీ అదిరిపోయింది. ఆర్య కు ఈమెకు మధ్య సన్నివేషాలు కడుపుబ్బా నవ్విస్తాయి. కమెడియన్ కరుణాకరన్ కూడా బాగానే నటించాడు. పాత్ర చిన్నదే కానీ బాగానే న్యాయం చేశాడు. భాను కూడా చక్కగా నటించి మెప్పించింది. చివర్లో విశాల్ సినిమాకే హైలైట్ అవుతుంది. ఇక అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ పాత్రను భార్యా బాధితుడిగా బాగా తెరకెక్కించారు. షకీలా గెస్ట్ పాత్రలో కనిపించి మెప్పించింది.
సాంకేతిక వర్గం:
దర్శకుడు రాజేష్ ఇలాంటి కామెడీ సినిమాలు ఇంతకు మునుపు కూడా చేసి మనల్ని బాగానే మెప్పించారు. అదే అనుభవం ఇలాకదా కూడా బాగా ఉపయోగపడింది. మరీ పాత కాలం కామెడీ కాకుండా సరికొత్తగా పరిస్థితుల ద్వారానే కామెడీ జెనరేట్ చేశారు. కామెడీనే ప్రధాన అంశంగా తెరకెక్కిన ఈ సినిమా బాగానే ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. పాటలు కూడా బాగానే అలరించాయి. డబ్బింగ్ పాటలు అయినప్పటికీ సినిమాకు బాగానే అనిపించాయి. నేపథ్య సంగీతం ఇంకా చాలా బావుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపించింది. ఎడిటింగ్ ఇంకాస్త బాగా చేసి ఉండచ్చు. సినిమాలో మొదటి సగంలో కొన్ని అక్కరలేని సీన్లను తీసేసిఉంటే బాగుండేది. ఇక ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి ప్రేక్షకులు బాగానే ఆదరిస్తారు.
తీర్పు:
ఈ సినిమా కామెడీ ప్రధానాంశంగా, ప్రేమ, పెళ్లి, స్నేహం విలువ చెప్పేలా ఉంటుంది స్నేహమా లేక ప్రేమ అనే పాయింట్ ను డైరెక్టర్ ఎం.రాజేష్ బాగా ఎలివేట్ చేస్తూ కథ రాసుకున్నాడు. ఆర్య, సంతానం కామెడీ సినిమాలో హైలైట్. ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. మొదట్లో సంతానం పెళ్లి ఎపిసోడ్, ఆ తరువాత సంతానం, భాను మొదటి రాత్రి ఎపిసోడ్ చాలా ఫన్నీ గా తెరకెక్కించారు. అలానే ఆర్య, తమన్నా మధ్య సన్నివేశాలు కూడా చాలా బావుంటాయి.  ప్రీ క్లైమాక్స్ లో షకీలా రోల్, క్లైమాక్స్ లో విశాల్ పాత్ర బాగా సెట్ చేశారు. ఇక సినిమా మొదలైన దగ్గరనుండి క్లైమాక్స్ దాకా కామెడీని బాగా రక్తికట్టించారు.  ఓవరగాల్ గా ‘ఐశ్వర్యాభిమస్తు’ చిత్రం తప్పకుండా చూడాల్సిన కామెడీ ఎంటర్టైనర్.