బీజెపీ ఎన్నికల వ్యూహంలో భాగంగా కొత్త ఎత్తుగడను తెర మీదకి తీసుకొచ్చింది.. మధ్యప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్... బీజెపీ ఎన్నికల స్టంట్..పాఠ్యపుస్తకాల్లో ఎమర్జెన్సీ చాప్టర్

బీజెపీ ఎన్నికల వ్యూహంలో భాగంగా కొత్త ఎత్తుగడను తెర మీదకి తీసుకొచ్చింది.. మధ్యప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ చరిత్ర పాఠ్యపుస్తకంలో ఎమర్జెన్సీ చాప్టర్ ను ప్రవేశపెట్టాలని కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు నిర్ణయించింది. ‘ఆపత్కాల్ ఏక్ కడ్వా సచ్’ పేరిట ఎమర్జెన్సీపై ఓ ఫాఠాన్ని 2019-20 విద్యాసంవత్సరం నుంచి చేర్చారు. ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీని బ్లాక్ డేగా ప్రకటించడంతోపాటు దీన్ని పదోతరగతి, 11వతరగతి కేంద్ర, మధ్యప్రదేశ్ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని నిర్ణయించినట్లు బీజేపీ సీనియర్ నాయకుడు, లోక్ తంత్ర సేనాని సమితి సభ్యుడు వెల్లడించారు. సంఘ్ పరివార్ నేతృత్వంలో ‘ఇతిమాస్ పునర్ లేఖన్ సమితి’ పేరిట చరిత్ర పుస్తకాన్ని పునర్ లిఖించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు.