గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పాకిస్తాన్, ఔరంగజేబుల పేర్లు వాడుకుని, ప్రజలను తప్పుదారి పట్టించి గెలిచిందని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ పేర్లు వాడుకుని ఎన్నికల్లో ఎల్లకాలం గెలవలేరని అన్నారు... మోడీ  పాకిస్థాన్ పేరు వాడుకొని గుజరాత్ ఎన్నికలో గెలిచారు ..అసదుద్దీన్ కామెంట్స్

Assaduddin Owasi comments PM Modiగుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పాకిస్తాన్, ఔరంగజేబుల పేర్లు వాడుకుని, ప్రజలను తప్పుదారి పట్టించి గెలిచిందని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ పేర్లు వాడుకుని ఎన్నికల్లో ఎల్లకాలం గెలవలేరని అన్నారు .అసదుద్దీన్ రాహుల్ గాంధీనీ సైతం విమర్శించారు.గుజరాత్‌లో ముస్లింలను మరింత అణగదొక్కారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. ‘ఎన్నికల్లో గెలుపు కోసం మోదీ, రాహుల్ గాంధీలు గుళ్లు, గోపురాల చుట్టూ చక్కర్లు కొట్టారని …ఓట్ల కోసమే ఇలా దిగజారారని మండిపడ్డారు . గుజరాత్‌లో బీజేపీని ఓడగొట్టేందుకు కాంగ్రెస్‌కు మంచి అవకాశం వచ్చింది. కానీ ఆ పార్టీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు .జీఎస్టీ, నల్లడబ్బుపై సరైన వ్యూహంతో ముందుకెళ్లలేకపోయింది.. బీజేపీ మిషన్ మోడ్‌లో పనిచేస్తోంది. దాన్ని ఓడించాలంటే విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి జాయింట్ ఫ్రంట్‌గా ఏర్పడాల్సిన అవసరం ఉంది.. ’ అని సూచించారు.