గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీని, పటేల్ వర్గం నేత హార్దిక్ పటల్ వివాదాస్పద వ్యాఖ్యలతో అభినందించారు. ‘ఈవీఎంలను ట్యాంపర్ చేసిన గెలిచిన బీజేపీకి నా హార్దిక శుభాకాంక్షు..’ అని అన్నారు. గుజరాత్... ట్యాపరింగ్ చేసి గెలిచిన మోడీ సర్కార్ కి కంగ్రాట్స్ చెప్పిన హార్దిక్ పటేల్ ..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీని, పటేల్ వర్గం నేత హార్దిక్ పటల్ వివాదాస్పద వ్యాఖ్యలతో అభినందించారు. ‘ఈవీఎంలను ట్యాంపర్ చేసిన గెలిచిన బీజేపీకి నా హార్దిక శుభాకాంక్షు..’ అని అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని పటేల్ సామాజిక వర్గం నేత హార్దిక్ పటేల్ ఆరోపించారు. సూరత్, రాజ్‌కోట్, అహ్మాదాబాద్‌లలో భారీగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించారు. ఈవీఎం ట్యాంపరింగ్‌పై విపక్షాలు పోరాడాలని కోరారు. తాను ఏ పార్టీకీ చెందిన వాడిని కాదని, గెలిచిన వారిని అభినందించడం మాత్రమే చేస్తున్నానన్నారు. ఈ ఫలితాలతో సంబంధం లేకుండా కోటా కోసం తమ ఉద్యమ సాగుతుందన్నారు. గుజరాత్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, 22 ఏళ్ల యువకుడి సెక్స్ సీడలను కాదని అన్నారు.