తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుక
సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి … అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. Read more
వెళ్లాలా..వ‌ద్దా..
పేరుకే జేడీఎస్ ముఖ్య‌మంత్రి. స‌గ‌భాగం కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే. అందుకే కొన్ని పార్టీలు క‌ర్ణాట‌క సీఎంగా కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారానికి వెళ్లాలా లేదా అని త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నాయి. చూసేందుకు జేడీఎస్ ప్ర‌భుత్వ‌మే అయినా అది కొలువుదీరేందుకు కాంగ్రెస్ పార్టీనే కీల‌కం. కాంగ్రెస్ ముందుకు రాక‌పోతే జేడీఎస్‌కి అధికారం క‌ల్లోకూడా జ‌ర‌గ‌ని ప‌ని. అందుకే దేవెగౌడ‌తో దోస్తానా ఉన్నా, కుమార‌స్వామిపై సానుకూల‌త ఉన్నా ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారానికి వెళ్తే కాంగ్రెస్‌కి మ‌ద్ద‌తిచ్చిన‌ట్ల‌వుతుంద‌ని కొన్ని పార్టీలు... Read more
అందుకేనా ప‌వ‌న్‌కి అంత ఆశ‌?
మొన్న‌టిదాకేమో ఇంకా త‌మ పార్టీ సంస్థాగ‌తంగా బ‌ల‌ప‌డ‌లేద‌ని, క్షేత్ర‌స్థాయిలో నిర్మాణం జ‌ర‌గ‌లేద‌ని, ఎంత బ‌లం ఉందో అంత‌వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతామ‌ని చెప్పుకొచ్చారు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. ఓ ద‌శ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో ఓ 50-60 సీట్ల‌లో పోటీచేయ‌డ‌మే ఎక్కువ‌న్న‌ట్లు సంకేతాలిచ్చారు. మ‌రి త‌ర్వాత మూడ్ మారిందో ఏమో…175 స్థానాల్లో త‌మ పార్టీ పోటీచేస్తుంద‌ని ప్ర‌క‌టించారు. అధికారం ల‌క్ష్య‌మే కాదు. ప్రశ్నించ‌డం కోస‌మే మా పార్టీ పుట్టింద‌ని ప‌దేప‌దే చెబుతూనే... Read more
లెక్కేంలేదు..ఉన్న‌ద‌ల్లా తిక్కే!
నాక్కాస్త తిక్కుంది. దానికో లెక్కుందంటాడు హీరో. అది సిన్మాకాబ‌ట్టి..పైగా వెన‌కాముందు చూసుకోని గ‌బ్బ‌ర్‌సింగ్ క్యారెక్ట‌ర్ కాబ‌ట్టి ఏమ‌న్నా న‌డుస్తుంది. ఏంచేసినా తెలుస్తుంది. కానీ ప‌బ్లిక్‌లోకొస్తే..ఎవ‌రు ఏమైనా అంటారు. ప్ర‌తీదీ నిశితంగా గ‌మ‌నిస్తారు. జ‌న‌సేన పార్టీపెట్టి పూట‌కో మాట మాట్లాడుతున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఈ లాజిక్ మిస్స‌వుతున్నారు. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీతో అంట‌కాగిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌ర్వాత రెండుపార్టీల‌మీదా విమ‌ర్శ‌లుచేసినా ఇప్పుడు కేవ‌లం టీడీపీనే టార్గెట్ చేస్తున్నారు. అచ్చం కేసీఆర్‌లాగే మోడీని ప‌ల్లెత్తు... Read more
చంద్ర‌బాబు చావుకొచ్చింది
వాజ్‌పేయిని ప్ర‌ధానిని చేశాన‌నీ..కేంద్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు చ‌క్రం తిప్పింది తానేన‌నీ…ప్ర‌ధాని ప‌ద‌వి తీసుకోమ‌న్నా తెలుగు ప్ర‌జ‌ల‌కోసం త్యాగం చేశాన‌నీ చెప్పుకునేందుకు బాగానే ఉంటుంది. కానీ అవ‌స‌ర‌మైన‌ప్పుడు గ‌ట్టిగా ఓ నిర్ణ‌యం తీసుకోవ‌డంలోనే నాయ‌క‌త్వ ప‌టిమ తెలిసిపోతుంది. ఏపీకి కేంద్రం తీర‌ని అన్యాయం చేసినందుకు క‌ర్ణాట‌క‌లో తెలుగు ప్ర‌జ‌లెవ‌రూ బీజేపీకి ఓట్లేయొద్ద‌ని టీడీపీ పిలుపునిచ్చింది. వాళ్లేశారో లేదోగానీ మొత్తానికి బీజేపీకి పూర్తి మెజారిటీ రాక‌పోయేస‌రికి అది త‌మ ప్ర‌భావ‌మేన‌ని తొడ‌లు... Read more
కేసీఆర్ లెక్క ప‌క్కా..
రైతుబంధు ప‌థ‌కం. పంట‌సాగుకు సాయం పేరుతో కేసీఆర్ తెర‌పైకితెచ్చిన ప‌థ‌కం రంగ‌స్థ‌లం సిన్మాలా సూప‌ర్ హిట్ట‌య్యేలా ఉంది. మ‌హాన‌టి సిన్మాలా నాలుగురోజుల‌కే మంచి టాక్ కొట్టేసింది. దాదాపుగా 58ల‌క్ష‌ల‌మందికి పైగా రైతుల‌కు నేరుగా న‌గ‌దుసాయం అందేలా కేసీఆర్ ప్రారంభించిన ప‌థ‌కంతో విప‌క్షాల‌కు మైండ్ బ్లాంక‌వుతోంది. రైతుల‌కు సాయం వద్ద‌ని చెప్ప‌లేరు. అలాగ‌ని మంచి ప‌థ‌కమ‌ని పొగ‌డ‌లేరు. కేసీఆర్ పొలిటిక‌ల్ గేమ్‌ని ఇప్పుడెలా తిప్పికొట్టాలో విప‌క్షాల‌కు అర్ధంకావ‌డంలేదు. కాపీరైట్ హ‌క్కుల‌కోస‌మో,... Read more
మ్యాచ్ ఫిక్సింగే…ఎనీ డౌట్స్‌?
పార్టీకి గుడ్‌బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించి…వైసీపీలోకి వెళ్లేందుకు రెడీ అయిన క‌న్నా ల‌క్ష్మినారాయణ ఇప్పుడు బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు. పార్టీనుంచి వెళ్లిపోతాన‌న్న నాయ‌కుడు రాత్రికిరాత్రే ఓ జాతీయ‌పార్టీకి రాష్ట్ర అధ్య‌క్షుడు అయిపోవ‌డం వింత‌కాక మ‌రేంటి? స‌రిగ్గా వైసీపీలో చేర‌డానికి ముందురోజే అస్వ‌స్థ‌త‌తో ఆస్ప‌త్రి పాల‌య్యారు క‌న్నా ల‌క్ష్మినారాయణ‌. అప్ప‌టికే ఆయ‌న అనుచ‌రులు ఊరంతా, చివ‌రికి ఇంటిముందు కూడా వైసీపీ ఫ్లెక్సీలు క‌ట్టేశారు. ఇంత స‌డెన్‌గా క‌న్నా ఎందుకు అనారోగ్యం పాల‌య్యారంటే... Read more
కొంపముంచిన ఒర్లురామ‌య్య‌
ఎప్ప‌ట్నించో త‌న నోటికి త‌గ్గ ప‌ద‌వికోసం వెయిటింగ్‌. ఆ మ‌ధ్య అవ‌కాశం క‌లిసొస్తే ఏకంగా రాజ్య‌స‌భ స‌భ్యుడినైపోవాల‌ని ఆశ‌ప‌డ్డాడా నాయ‌కుడు. నోరెత్తితే అల‌వోక‌గా దాన‌వీర‌శూర‌క‌ర్ణ‌ని మ‌రిపించేలా డైలాగులు చెప్ప‌గ‌ల‌ ఆ నాయ‌కుడికి చివ‌రికి ఆర్టీసీ చైర్మ‌న్ ప‌ద‌వి వ‌రించింది. చ‌చ్చినోడి పెళ్లికి వ‌చ్చిందే క‌ట్న‌మ‌న్న‌ట్లు క‌ద‌ల‌కుండా సీట్లో కూర్చోకుండా ఎగేసుకుని ఊరిమీదికి బ‌య‌లుదేరాడా లీడ‌ర్‌. బ‌స్సులో ఇయ‌ర్‌ఫోన్స్ పెట్టుకుని పాట‌లు వింటున్న యువ‌కుడిని కెలికి మ‌రీ కొరివితో త‌ల‌గోక్కున్నాడు.... Read more
అమిత్ షా సెగ త‌గులుతుందా?
బీజేపీ అధ్య‌క్షుడు అమిత్‌షాకి తిరుమ‌ల‌లో కొంద‌రు నిర‌స‌న వ్య‌క్తంచేయ‌టం…ఈ సంద‌ర్భంగా ఘ‌ర్ష‌ణ జ‌ర‌గ‌డంతో ఈ వ్య‌వ‌హారం బీజేపీ-టీడీపీ మ‌ధ్య అగాధాన్ని మ‌రింత పెంచేలా ఉంది. ఎన్డీఏనుంచి బ‌య‌టికొచ్చి కేంద్రానికి వ్య‌తిరేకంగా ధ‌ర్మ‌పోరాటం మొద‌లుపెట్టిన చంద్ర‌బాబు ఇప్ప‌టిదాకా గాంధేయ‌ప‌ద్ధ‌తిలోనే వెళ్తున్నారు. కానీ త‌మ్ముళ్లు చూపించిన అత్యుత్సాహంతో తిరుమ‌ల ఘ‌ట‌న‌ని కేంద్రం సీరియ‌స్‌గా తీసుకునేలా ఉంది. ఇప్ప‌టికే మే 15 త‌ర్వాత చంద్ర‌బాబుని ఓ ఆట ఆడిస్తామ‌న్న‌ట్లు సంకేతాలు ఉన్నాయి. చంద్ర‌బాబు... Read more
ఓటుకు నోటు డొల్లుపుచ్చ‌కాయేనా?
మూడేళ్ల త‌ర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ఓటుకునోటు కేసు గుర్తొచ్చింది. చంద్ర‌బాబు త‌ప్పించుకోలేడంటూ మూడేళ్ల‌క్రితం హూంక‌రించి త‌ర్వాత అట‌కెక్కించేసిన ఫైల్‌ని కీల‌క స‌మ‌యంలో, త‌న‌కు అవ‌స‌ర‌మ‌నుకున్న స‌మ‌యంలో కిందికి దించారు కేసీఆర్‌. చంద్ర‌బాబు వాయిస్ రికార్డ్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఈమ‌ధ్యే అందింద‌నేది స‌ర్కారు చెప్పే కార‌ణం. ఓ ఆడియో వాయిస్ ధ్రువీక‌ర‌ణ‌కు ఇంత‌కాలం ఎందుకు ప‌డుతుందో, ఎందుకు ప‌ట్టిందో కేసీఆర్ అండ్ కోకే తెలియాలి. స్టీఫెన్‌స‌న్‌తో మాట్లాడిన మ‌న‌వాళ్లు... Read more