కెసిఆర్ ను సంతోషపెట్టడానికి నేతి విద్యాసాగర్ రావు ఇంట్లో కాపు నేతల భేటీ జరిగిన్నట్లు ఉందన్నారు కాంగ్రెస్ సేనియర్ నేత విహెచ్..ఈ సమావేశానికి తనని కూడా ఆహ్వానించారని తెలిపారు..ఐతే రెండు లక్షల మందితో... కెసిఆర్ ను సంతోషపెట్టడానికి మున్నూరు కాపులు సభ పెట్టాలా…!

కెసిఆర్ ను సంతోషపెట్టడానికి నేతి విద్యాసాగర్ రావు ఇంట్లో కాపు నేతల భేటీ జరిగిన్నట్లు ఉందన్నారు కాంగ్రెస్ సేనియర్ నేత విహెచ్..ఈ సమావేశానికి తనని కూడా ఆహ్వానించారని తెలిపారు..ఐతే రెండు లక్షల మందితో సభ పెడితే కెసిఆర్ సంతోషపడుతారని అక్కడ సమావేశానికి వచ్చిన వాళ్ళు చెప్పుకొచ్చిన్నట్లు తెలిపారు.ఈ భేటీ కేవలం కెసిఆర్ ను ఎలా సంతోషపెట్టాలి అని చర్చించడానికే జరిగిందని….మరి రెడ్లు సభ పెడితేనే కెసిఆర్ భూమి కేటాయించారా..! మరి మున్నూరు కాపులు సభ ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు..ముందు మున్నూరు కాపు సంఘానికి పది ఎకరాల భూమి , పది లక్షల రూపాయలు ఇవ్వాలని..తర్వాత కృతజ్ఞత సభ గురించి ఆలోచిద్దామన్నారు విహెచ్..ఒక పార్టీ కోసం కులాన్ని ఇలా వాడుకోవడం సరికాదన్నారు విహెచ్…