ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తన బలం పెంచుకునే పనిలో ఉంటె..మరో వైపు అధికార పార్టీ కాంగ్రెస్ ని చేరికలతో వీక్ చేయాలనీ చూస్తుంది…ఇప్పటికే అనేకమంది కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్ గూటికి చేరగా... కారు ఎక్కడానికి సిద్దమౌతున్న మాజీ మంత్రి ముకేశ్ ….?

ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తన బలం పెంచుకునే పనిలో ఉంటె..మరో వైపు అధికార పార్టీ కాంగ్రెస్ ని చేరికలతో వీక్ చేయాలనీ చూస్తుంది…ఇప్పటికే అనేకమంది కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్ గూటికి చేరగా …ఇప్పుడు గోషామహల్‌ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు ఊహాగానాల వస్తున్నాయి ముఖేష్‌ ఈ నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్‌ హయాంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి పోటీ చేసిన ముఖేష్‌గౌడ్‌ ఓటమి తర్వాత ఇప్పటివరకు క్రియాశీలక రాజకీయాలు దూరంగా ఉన్నారు..ఐతే కొద్దీ నెలల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఓ పార్టీ అధ్యక్షుడు, నగరానికి చెందిన ఒక పార్లమెంట్‌ సభ్యుడు ముఖేష్‌గౌడ్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్పించేందుకు కేసీఆర్‌ వద్ద రాయబారం నడిపినట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఆ ఎంపీ కేసీఆర్‌కు నచ్చజెప్పడంతో ముఖేష్‌గౌడ్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఎంజే మార్కెట్‌లోని తన కార్యాలయంలో ఈ నెల 15వ తేదీన ముఖేష్‌గౌడ్‌ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, అనుచరులతో సమావేశం కానున్నారు. మరి ముకేశ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి…