ఆ పెళ్లికొడుకు రాక కోసం చూస్తున్న అతిథులపై ఉన్నట్టుండి కానుకల వర్షం కురిసింది. ఊహించని విధంగా వారిపైకి డాలర్లు, రియాళ్లు, కొత్త సెల్‌ ఫోన్లు వచ్చి పడ్డాయి. తన పెళ్లి అందరికీ గుర్తుండిపోవాలని... ఈ పెళ్ళిలో ఒకటే డాలర్లు ,రియళ్లూ ,సెల్ ఫోన్ల వర్షం ..

 ఆ పెళ్లికొడుకు రాక కోసం చూస్తున్న అతిథులపై ఉన్నట్టుండి కానుకల వర్షం కురిసింది. ఊహించని విధంగా వారిపైకి డాలర్లు, రియాళ్లు, కొత్త సెల్‌ ఫోన్లు వచ్చి పడ్డాయి. తన పెళ్లి అందరికీ గుర్తుండిపోవాలని ఆ వరుడు ఆహూతులను కళ్లు చెదిరే నజరానాలతో ముంచెత్తాడు.పాకిస్థాన్‌లోని ముల్తా న్‌ ప్రాంతం షుజాబాద్‌కు చెందిన మహమ్మద్‌ అర్షాద్‌కు పంజాబ్‌ ప్రావిన్స్‌ ఖాన్‌పూర్‌కు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. వధువు ఇంటికి చేరుకోగానే వరుడు, అతని కుటుంబ సభ్యులు పెళ్లికి వచ్చిన వారిపై కరెన్సీ, విలువైన కొత్త సెల్‌ఫోన్లను ‘క్యాచ్‌’ అంటూ విసరడం మొదలుపెట్టారు. వాటిని దొరకపుచ్చుకునేందుకు అతిథులంతా ఎగబడ్డారు. ఈ వాన ఆగే సరికి అందరికీ ఏదో ఒక కానుక దక్కింది. ఇది తెలిసి ఖాన్‌పూర్‌ వాసులు కూడా పరుగులు తీస్తూ వచ్చారు!