వివిధ కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు గారికి బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ శ్రీ కె.స్వామిగౌడ్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి... పత్రికా ప్రకటన ఉపరాష్ట్రపతికి బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం


వివిధ కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు గారికి బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ శ్రీ కె.స్వామిగౌడ్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ ఘనస్వాగతం పలికారు. ఉదయం సుమారు 9.30 గంటలకు హైదరాబాదుకు చేరుకున్న అనంతరం ఉపరాష్ట్రపతి విద్యానగర్ లోని అడ్వాన్స్ ట్రేనింగ్ ఇనిస్టిట్యూట్ లో రీజినల్ వొకేషనల్ శిక్షణాసంస్ధకు శంఖుస్ధాపన నిమిత్తం బయలుదేరి వెళ్లారు. శని,ఆదివారాల్లో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం ఆయన సోమవారం ఉదయం తిరిగి ఢీల్లీకి వెళ్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్,డి.జి.పి. శ్రీ అనురాగ్ శర్మ, జి.ఏ.డి ముఖ్యకార్యదర్శి శ్రీ అధర్ సిన్హా, రాజ్ భవన్ ముఖ్యకార్యదర్శి శ్రీ హరిప్రీత్ సింగ్, హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి ఎం.ప్రశాంతి, ప్రభుత్వ ఉన్నతాధికారులు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.