సోనియాగాంధీ, రాజీవ్ ది ప్రేమ పెళ్లి అన్ని అందరికి తెలుసు ..ఐతే రాజీవ్ ఎలా ప్రపోజ్ చేశాడో తెలుసా …సోనియా ని చూడగానే రాజీవ్ గాంధీ ఇష్టపడ్డారట. రాజీవ్ గాంధీ.. సోనియాను తొలిసారిగా... రాజీవ్ గాంధీ సోనియా కి ఎలా ప్రపోస్ చేశాడో తెలుసా …!

సోనియాగాంధీ, రాజీవ్ ది ప్రేమ పెళ్లి అన్ని అందరికి తెలుసు ..ఐతే రాజీవ్ ఎలా ప్రపోజ్ చేశాడో తెలుసా …సోనియా ని చూడగానే రాజీవ్ గాంధీ ఇష్టపడ్డారట. రాజీవ్ గాంధీ.. సోనియాను తొలిసారిగా ఒక రెస్టారెంట్‌లో చూశారు. రాజీవ్‌గాంధీ కేంబ్రిడ్జి యూనివర్శిటీలో చదువుకుంటున్న సమయంలో ఆయన గ్రీక్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ రాజీవ్.. సోనియాను తొలిసారిగా చూశారు. వెంటనే రాజీవ్‌లో సోనియాపై ప్రేమ చిగురించింది. కేంబ్రిడ్జి యూనివర్శిటీ‌కి చెందిన గ్రీక్ రెస్టారెంట్ ఓనర్ చార్లస్ ఆంటోనీతో రాజీవ్ గాంధీ.. తాను ఆ ఇటాలియన్ యువతి పక్కన కూర్చోవాలనుకుంటున్నానని చెప్పారు. ఈ మాటవినగానే కంగారు పడిన ఆంటోనీ ఇందుకోసం అధికంగా డబ్బు చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. వెల్లడైన వివరాల ప్రకారం రాజీవ్ గాంధీ నేపికిన్‌పై సోనియాపై ఒక కవిత రాశారు. దానితో పాటు ఒక షాంపేన్ బాటిల్‌ను సోనియాకు అందజేయమని అతనిని కోరారు. కాగా సోనియాతో రాజీవ్ తన మనసులోని అభిప్రాయాన్ని నిస్సంకోచంగా వెల్లడించారట. సోనియా… తాను చూసిన మహిళలందరిలోకీ అందగత్తె అని రాజీవ్ గాంధీ కితాబిచ్చారట. రాజీవ్ తన కాలేజీ ఫ్రెండ్స్‌తో కూర్చున్నప్పుడు సోనియా కూడా అక్కడికి వచ్చి, రాజీవ్ చేయిపట్టుకుని కూర్చునేవారు. రాజీవ్‌గాంధీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోనియాను చూడగానే ఈమె నాకోసమే పుట్టిందని అనుకున్నానని చెప్పారు. కాగా సోనియాగాంధీ తండ్రి స్టిఫెన్ మైనో.. రాజీవ్‌తో సోనియా వివాహానికి నిరాకరించారు. రాజీవ్.. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు అయినందునే ఆయన ఈ పెళ్లిని వ్యతిరేకించారు.