హైపర్ అది అంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రలో తెలియని వారు ఉండరు..జబర్దస్త్ లో తాను చేస్తున్న కామిడీ అలాంటిది …ఐతే త్వరలో అది పవన్ కోసం స్క్రిప్ట్ రాయబోతున్నాడా..అంటే అవుననే తెలుస్తుంది. గత... పవన్ కోసం పంచ్ దైలౌగే రాస్తున్న జబర్దస్త్ ఫెమ్ హైపర్ అది

హైపర్ అది అంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రలో తెలియని వారు ఉండరు..జబర్దస్త్ లో తాను చేస్తున్న కామిడీ అలాంటిది …ఐతే త్వరలో అది పవన్ కోసం స్క్రిప్ట్ రాయబోతున్నాడా..అంటే అవుననే తెలుస్తుంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కి మద్దతు పలికిన జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ , ఈసారి మాత్రం ఒంటరిగా 2019 ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నాడు. ఈ నేపథ్యం లో పవన్ కు సపోర్ట్ గా ఆయన అభిమాని జబర్డస్త్ ఫేమ్ హైపర్ ఆది, వచ్చే ఎన్నికల కోసం తన అభిమానాన్ని చాటుకోబోతున్నాడు. కత్తి మహేశ్ వివాదం సమయంలో పవన్ అభిమానుల వైపు మాట్లాడి సంచలనం సృష్టించాడు. అలాంటి హైపర్ ఆది వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేయబోతున్నాడట.ఇటీవల పవన్‌ను కలిసిన హైపర్ ఆది తనకు జనసేన పార్టీలో చేరాలని ఉందని, అయితే తన కెరీర్ దృష్ట్యా కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని, అందుకోసం వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారానికి వస్తానని పవన్‌తో అన్నాడట. దీనికి పవన్ ‘‘మీకు ఓకే అయితే నాకు అభ్యంతరం లేదు’’ అన్నాడట. దీంతో హైపర్ ఆది ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండే ఆది పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ రాసే పని పెట్టుకున్నాడని ప్రచారం జరుగుతుంది.