పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర ఎక్సైజ్‌శాఖమంత్రి కె.ఎస్.జవహర్‌ మండిపడ్డారు..జనసేన పార్టీ వ్యవస్థ్దాపకుడు పవన్‌కల్యాణ్‌కు నిలకడ లేదని ….గతంలో అన్న ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కాంగ్రెస్‌కు హోల్‌సేల్‌గా అమ్మేశారని మంత్రి ఎద్దేవా చేశారు. అలాగే... పీఆర్పీ ని అమ్మేశారు..ఇప్పుడు జనసేనను రిటైల్‌గా అమ్మేస్తాడు’

పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర ఎక్సైజ్‌శాఖమంత్రి కె.ఎస్.జవహర్‌ మండిపడ్డారు..జనసేన పార్టీ వ్యవస్థ్దాపకుడు పవన్‌కల్యాణ్‌కు నిలకడ లేదని ….గతంలో అన్న ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కాంగ్రెస్‌కు హోల్‌సేల్‌గా అమ్మేశారని మంత్రి ఎద్దేవా చేశారు. అలాగే పవన్‌కల్యాణ్‌ జనసేనను రిటైల్‌గా అమ్మకానికి సిద్ధం చేశారన్నారు. విశ్వసనీయతలేని అధికారమే పరమావధిగా వెళ్లే పార్టీలను ప్రజలు నమ్మరని అన్నారు..టీడీపీ పాలనలోనే దళితులకు న్యాయం జరిగిందన్నారు. మరోసారి సీఎం చంద్రబాబునాయుడు గెలవటం ఖాయమని మంత్రి జవహర్‌ అన్నారు. మండపేటలో ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి జవహర్‌ మాట్లాడారు.