భాగ్యనగరంలో నిలువనీడ లేని అభాగ్యులెందరో. పగలంతా దొరికింది తిని, రాత్రి ఫుట్ పాత్ లపై నిద్రిస్తుంటారు. ఇలాంటి నిరాశ్రయులను చలికాలం మరింత ఇబ్బంది పెడుతుంటుంది. కప్పుకునేందుకు దుప్పటి కూడా లేని వీళ్లకు సహాయం... నిరాశ్రయులకు మనం సైతం దుప్పట్ల పంపిణీ…

IMG_36

భాగ్యనగరంలో నిలువనీడ లేని అభాగ్యులెందరో. పగలంతా దొరికింది తిని, రాత్రి ఫుట్ పాత్ లపై నిద్రిస్తుంటారు. ఇలాంటి నిరాశ్రయులను చలికాలం మరింత ఇబ్బంది పెడుతుంటుంది. కప్పుకునేందుకు దుప్పటి కూడా లేని వీళ్లకు సహాయం చేసేందుకు మనం సైతం ముందుకొచ్చింది. ఫుట్ పాత్ లపై నిద్రిస్తున్న వాళ్ల బాధలకు స్పందించిన మనం సైతం సభ్యులు దుప్పట్లు, రగ్గులు, శాలువాలు అందించారు. అర్థరాత్రి నగరంలో కాదంబరి కిరణ్, కుంపట్ల రాంబాబు, వేణు, సురేష్ , రవి, సీసీ శ్రీను, బందరు బాబి, వల్లభనేని అనిల్, వినోద్ బాల ఈ నిరాశ్రయుల దగ్గరకు వెళ్లి దుప్పట్లు అందజేశారు. ఈ సేవా కార్యక్రమం తనకెంతో సంతృప్తినిచ్చిందని మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ…చలికాలం ఇంట్లో ఉన్న మనమే తట్టుకోలేకపోతుంటాం. అలాంటిది రహదారుల పక్కన నిద్రించే వాళ్లకు ఎంత బాధ ఉంటుందో ఊహించుకోవచ్చు. చలికి ఇబ్బందులు పడుతున్న నిరాశ్రయులపై దినపత్రికల్లో వచ్చిన వార్తలు చదివి…మనం సైతం సభ్యులుగా తక్షణం స్పందించాం. రాత్రికి రాత్రే దుప్పట్లు, రగ్గులు, శాలువాలు తీసుకుని వెళ్లి వాళ్లకు అందించాం. అన్నారు.