ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి కిరణం …మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి…రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్….తెర వెనుక నుండి తెర ముందుకు వచ్చేశారు.. ఈ... చీకటి నుంచి బయటికి వచ్చారు…దూరమైనా మిత్రులను దగ్గర చేసుకుంటున్నారు…!

 ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి కిరణం …మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి…రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్….తెర వెనుక నుండి తెర ముందుకు వచ్చేశారు.. ఈ నెల 13 న రాహుల్ గాంధీ తో భేటీ అయ్యే అవకాశం ఉంది…అనంతరం ఈ నెల 18 న పార్టీ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది… దీంతో కాంగ్రెస్ కార్య కర్తల్లో కొత్త ఉత్సహాం కలుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయం లో కాంగ్రెస్ పార్టీ తరుపున ముఖ్య మంత్రి పదవి చేసిన..కిరణ్, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రాలు కాస్త వేరే గా విడిపోవడం , దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ కావడం తో ఆ పార్టీ కి గుడ్ బై చెప్పి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. పార్టీ అయితే స్థాపించారు కానీ తర్వాత అడ్రెస్ లేకుండా పోయాడు.ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన కేబినెట్‌లో పని చేసిన మంత్రులు, అప్పటి ఎమ్మెల్యేలు, తనతో సన్నిహితంగా మెలిగిన నేతలపైనా కిరణ్‌ దృష్టి సారించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ కు దూరంగా ఉంటూ… మరే పార్టీలోనూ చేరని వారికి కిరణ్‌ స్వయంగా ఫోన్లు చేసి తిరిగి కాంగ్రె్‌సలో చేరదామని ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ‘జాతీయస్థాయిలో మన పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది. ఏపీలోనూ మంచి రోజులొస్తాయి. మళ్లీ పార్టీని బలోపేతం చేద్దాం’ అని ఆయన ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం..