మంత్రి గంట శ్రీనివాస్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్….గత ఎన్నికల సమయంలో చిట్టివలస జూట్‌మిల్లు లాకౌట్‌ సమస్య తనకు తెలియకపోవడంతో మంత్రి గంటా శ్రీనివాసరావుకు మద్దతు... మంత్రి గంటకు మద్దతు ఇచ్చి బాధపడుతున్న…పవన్ కళ్యాణ్

మంత్రి గంట శ్రీనివాస్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్….గత ఎన్నికల సమయంలో చిట్టివలస జూట్‌మిల్లు లాకౌట్‌ సమస్య తనకు తెలియకపోవడంతో మంత్రి గంటా శ్రీనివాసరావుకు మద్దతు తెలియజేశానని పవన్‌కల్యాణ్‌ విచారం వ్యక్తం చేశారు. జూట్‌మిల్లులో పర్యటించిన అనంతరం మిల్లు ఎదుట కార్మికసంఘాలు, కార్మిక కుటుంబాలతో సమావేశమయ్యారు. లక్ష మంది ప్రజలు పరోక్షంగా లాకౌట్‌తో రోడ్డున పడ్డారన్నారు. మిల్లు సమస్య అర్ధం చేసుకోవడానికి మరోసారి కార్మికసంఘాలతో నగరంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమై లాకౌట్‌ పరిష్కారానికి దిశానిర్ధేశం చేస్తామన్నారు. కార్మికసంఘాల నాయకులు అల్లు బాబూరావు, కొండపు ఈశ్వరరావు, ఆర్‌.ఎస్‌.ఎన్‌.మూర్తి, నాగోతు అప్పలరాజు, చిల్ల వెంకటరెడ్డి వినతిపత్రం అందించారు..మరి దీని పై మంత్రి గంట ఎలా స్పందిస్తారో చూడాలి…