అట్టహాసంగా జరిగిన పట్టాభిషేకం కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు స్వీకరించారు.అధ్యక్షుడిగా మొదటి ప్రసంగం లోనే ప్రత్యర్థి పార్టీలను సైతం సంభ్రమానికి గురిచేసేలా రాహుల్ స్పీచ్ కొనసాగింది ..‘‘అనేకమంది ఆదర్శవాదుల్లో నేను కూడా... యువరాజు …రాజు అయ్యాడు…రాహుల్ టైం స్టార్ట్ అయింది..

అట్టహాసంగా జరిగిన పట్టాభిషేకం కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు స్వీకరించారు.అధ్యక్షుడిగా మొదటి ప్రసంగం లోనే ప్రత్యర్థి పార్టీలను సైతం సంభ్రమానికి గురిచేసేలా రాహుల్ స్పీచ్ కొనసాగింది ..‘‘అనేకమంది ఆదర్శవాదుల్లో నేను కూడా ఒకడిని. దేశ రాజకీయాల్లో ఇవాళ జాతీయవాదం లోపించింది. ప్రజలను ఉద్దరించాల్సింది పోయి వారిని మరింత అణగదొక్కేందుకు రాజకీయాలను ఉపయోగించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 21 శతాబ్దానికి నడిపిస్తే… ప్రధాని మాత్రం వెనక్కి తీసుకెళ్తున్నారు. నేటి రాజకీయాల కారణంగా మనలో చాలామంది భ్రమలో బతికేస్తున్నారు. రాజకీయాల్లో కనికరం, పారదర్శకత లోపించాయి. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో నూతన జవసత్వాలు నింపుతాం. పాత, కొత్త తరాలను కలుపుకుని ముందుకెళ్తాం. వచ్చేరోజుల్లో దేశ నలుమూలలా కాంగ్రెస్ పార్టీ గళం మార్మోగాలి అంటూ రాహుల్ ప్రసంగం సాగింది . ఒంటరిగా పోరాడలేని వారికి నూతన బలాన్ని అందించి కలిసికట్టుగా పోరాడతాం. బీజేపీ ఎవరైనా నిలువరించగలవారు ఉంటే అది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలే. బీజేపీ రాజకీయ విధానాలు మాకు నచ్చకపోయినప్పటికీ మేము వారిని సోదరీ, సోదరుల్లానే భావిస్తాం. వాళ్లు మమ్ముల్ని తుడిచిపెట్టాలనుకుంటున్నారు… అయితే మేము వారిని కలుపుకుని పోవాలనుకుంటున్నాం. ప్రేమ, వాత్సల్యంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నామన్నారు..