టీం ఇండియా మాజీ కెప్టెన్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ తన కెరీర్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన ‘గో స్పోర్ట్స్ అథ్లెట్స్’ కాన్‌క్లేవ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..... నా కెరీర్ లో సక్సెస్ కంటే ఎక్కువ ఫెయిల్యూర్ లే ఉన్నాయి ..రాహుల్

టీం ఇండియా మాజీ కెప్టెన్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ తన కెరీర్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన ‘గో స్పోర్ట్స్ అథ్లెట్స్’ కాన్‌క్లేవ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన కెరీర్‌లో విజయాల కంటే వైఫల్యాలే ఎక్కవ అన్నారు . ‘‘నేను భారత్‌ కోసం 604 మ్యాచ్‌లు ఆడాను, కానీ అందులో 410 మ్యాచ్‌ల్లో నేను కనీసం యాభై పరుగులు కూడా చేయలేదు. ఈ గణాంకాల ప్రకారం చూస్తే.. నేను వైఫల్యం చెందినట్టే’’ అని తెలిపారు. ఇక అక్కడ ఉన్న యువ క్రీడాకారులను ఉద్దేశిస్తూ..‘‘సాధారణంగా మనం ఫెయిల్ అయినప్పుడు.. ఎక్కడైనా దాక్కుంటాం. ఇతరులను నిందిస్తాం. లేక సాకూలు చెప్పేందుకు ప్రయత్నిస్తాం. ఇలా కాదు. మనం ఫెయిల్ అయినప్పుడు మనల్ని మరింతలోతుగా అర్థం చేసుకొనేందుకు అవకాశం వస్తుంది. దాన్ని వినయోగించుకోవాలి’’ అని అన్నారు.