బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీలియోన్‌కు వ్యతిరేకంగా బెంగళూరులో మంటలు రేగుతున్నాయి ..నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు సన్నీలియోన్ ఈనెల 31న బెంగళూరుకు రానుంది. ఆమె రాకను వ్యతిరేకిస్తున్న ప్రొ కన్నడ గ్రూప్ కర్ణాటక... సన్నీలియోన్ పై ఫైర్ …ఆమె పోస్టర్లకు నిప్పు

బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీలియోన్‌కు వ్యతిరేకంగా బెంగళూరులో మంటలు రేగుతున్నాయి ..నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు సన్నీలియోన్ ఈనెల 31న బెంగళూరుకు రానుంది. ఆమె రాకను వ్యతిరేకిస్తున్న ప్రొ కన్నడ గ్రూప్ కర్ణాటక రక్షణ వేదిక యువసేన కార్యకర్తలు సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని, లేదంటే ఆత్మహత్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా రోడ్లపై ఆందోళనలు నిర్వహించిన యువసేన సభ్యులు సన్నీ పోస్టర్లను దహనం చేశారు. ఆమె రాకతో కన్నడ సంస్కృతి నాశనమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు .. సన్నీలియోన్ కురచ దుస్తులు ధరించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఆమె కనుక చీర ధరించి ఈవెంట్‌లో పాల్గొంటే తాము కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతామని చెప్పుకొస్తున్నారు . సన్నీ గతం మంచిది కాదని, అటువంటి వారిని తాము ప్రోత్సహించబోమని అన్నారు. డిసెంబరు 31న ఆమె బెంగళూరులో అడుగుపెడితే తాము ఆత్మహత్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు