టి.ఎస్‌.ఆర్ టీవీ 9నేషనల్‌ అవార్డుల (2017 – 2018) 5వ వార్షికోత్సవ ప్రధానోత్సవం ఫిబ్రవరి 17న విశాఖపట్నం లో అశేష జనవాహిని మధ్య సినీ పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో సినీ తారల ఆట... విశాఖలో వైభవంగా జరిగిన టి.ఎస్.ఆర్ –  టివి 9 సినీ అవార్డుల వేడుక


టి.ఎస్‌.ఆర్ టీవీ 9నేషనల్‌ అవార్డుల (2017 – 2018) 5వ వార్షికోత్సవ ప్రధానోత్సవం ఫిబ్రవరి 17న విశాఖపట్నం లో అశేష జనవాహిని మధ్య సినీ పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో సినీ తారల ఆట పాటలతో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఆంద్రప్రదేశ్ మంత్రి వర్యులు శ్రీ ఘంటా శ్రీనివాస్ గారు హాజరయ్యారు. ఈ వేడుకలో చిరంజీవి, మోహన్ బాబు,బాలకృష్ణ, నాగార్జున, విశాల్, తో పాటు మరెందరో సినీ ప్రముఖులు ఒకే వేదికపై కనిపించడం తో అభిమానుల ఆనందానికి అంతు లేకుండా పోయింది… హీరోలందరూ సోదరభావం తోనే ఉంటాం …అని చెప్పి అభిమానులను సంభ్రమాచర్యాలకు గురిచేశారు.
ఈ కార్యక్రమాన్ని అమర వీరులకు నివాళులు అర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా.. సాంస్కృతిక సార్వభౌమ, కళాబంధు,రాజ్యసభ సభ్యులు టి సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – “ప్రతిభాషా ప్రేక్షకులకు తమ అభిమాన నటీనటులను,ఆర్టిస్టులను, టెక్నిషన్స్ ను సత్కరిస్తుంటే వారు ఎంతగానో ఆనందిస్తారు. అందుకని ఎంతో కృషితో రాత్రింబవళ్లు కష్టపడి టీవీ9 సహాయంతో ఈ అవార్డ్స్ లను ప్రకటించడం జరిగింది. నాకు అభినందనలు కాదు …కళాకారుల ఆనందం కావాలి అందుకే గత 20 సంవత్సరాలనుండీ ఎన్నో ఆధ్యాత్మిక,
సాంస్కృతిక,సామాజిక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను మీ అందరి సంతోషమే నా శక్తి. ఒకే వేదికపై చిరంజీవి,మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున,విశాల్ లాంటి హీరోలను చూడడం కన్నుల పండుగగా ఉంది. భారత దేశ చరిత్రలో ఏ అవార్డ్ ల ఫంక్షన్ కూడా ఇలా ప్రజల సమక్షంలో జరగలేదు. అభిమానుల ఆనందం నాకు టానిక్ లాంటిది. కళాకారుడు ఈశ్వరునితో సమానం. వారిని ప్రోత్సహించడం అంటే ఈశ్వరున్ని ప్రోత్సహించడమే”అన్నారు.