ఫ్రిబవరి 9, 2018 నుంచి ప్రారంభంకానున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ ప్రస్తుతం పలు వివాదాలకి కేంద్రబిందువు అవుతోంది. తాజాగా విడుదల చేసిన ఈ టోర్నీ లోగో అసభ్యంగా ఉండటంతో దీనిపై పలువురు దిగ్గజ... ఇదేం దిక్కుమాలిన లోగో …చూడండి

ఫ్రిబవరి 9, 2018 నుంచి ప్రారంభంకానున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ ప్రస్తుతం పలు వివాదాలకి కేంద్రబిందువు అవుతోంది. తాజాగా విడుదల చేసిన ఈ టోర్నీ లోగో అసభ్యంగా ఉండటంతో దీనిపై పలువురు దిగ్గజ చెస్ క్రీడాకారులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ లోగోలో ఇద్దరు వ్యక్తులు కామసూత్రలో శైలిలో ఉండి మధ్యలో ఓ చెస్ బోర్డు పెట్టుకొని ఆడుతున్నట్లుగా డిజైన్ చేశారు. మాస్కోకి చెందిన శుఖా డిజైన్ సంస్థ ఈ లోగోని డిజైన్ చేయగా.. లోగోపై వస్తున్న విమర్శలను కూడా సమర్థవంతంగా ఎదుర్కుంటుంది. ‘ఈ లోగో ఎంత వివాదాస్పదంగా ఉందో అంతే అధునాతనంగా ఉంది. ఏ విధంగా అంటే ఛాంపియన్‌షిప్ జరుగనున్న సిటీలా.. ఈలోగో కోసం మా ఆర్టిస్టులు దాదాపు ఓ సంవత్సరం కష్టపడ్డారు. ఈ లోగోని మగ్గులు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, క్రీడా ప్రాంగణం వద్ద, టీవీల్లో, ఇతర ప్రసార మాద్యమాల్లో ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని టోర్నీ నిర్వహకులు తెలిపారు.కాగా భారత చెస్ గ్రాండ్‌మాస్టర్, ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ విజేత విశ్వనాథ్ ఆనంద్ ఈ లోగోపై అంతృప్తి వ్యక్తం చేశారు.