హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గెలిస్తే అరగుండు గీయించుకుంటానని శపధం చేసాడు వైసీఆర్ నేత నవీన్ నిశ్చల్..తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అయన 2009 ఎన్నికల్లోనే తాను ఎమ్మెల్యేను... 2019 లో బాలకృష్ణ గెలిస్తే గుండు గీయించుకుంటా..!


హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గెలిస్తే అరగుండు గీయించుకుంటానని శపధం చేసాడు వైసీఆర్ నేత నవీన్ నిశ్చల్..తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అయన 2009 ఎన్నికల్లోనే తాను ఎమ్మెల్యేను కావాల్సిందని, కానీ.. రఘువీరారెడ్డి వల్లే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనకు టికెట్ కేటాయించలేదని అన్నారు.ఇక 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బాలకృష్ణ పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. 2019లో బాలకృష్ణను ప్రజలు నమ్మబోరని , భగవంతుడు తనకు ధనం ఇవ్వకపోయినా, ప్రజా బలం ఇచ్చాడని , 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున తనకు టికెట్టు వస్తే తప్పకుండా విజయం సాధిస్తానని నవీన్ ధీమా వ్యక్తం చేసాడు. ఒకవేళ వచ్చే ఎన్నికలలో బాలకృష్ణపై తాను గెలవకపోతే అరగుండుతో ఊరేగుతానని శపధం చేసారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది.